- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Assembly: 10 మంది ఎమ్మెల్యేల సస్పెండ్.. వాళ్లు వీరే..
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగింది. అసెంబ్లీలో గవర్నర్‌ను శాసన సభకు ఆహ్వానించే అంశంపై చర్చ జరిగింది. గవర్నర్‌ను వెయిట్ చేయించి అపహాస్యం చేశారంటూ టీడీపీ చేసిన ఆరోపణలను మంత్రులు ఖండించారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో తొలుత పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
అనంతరం శాసనసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మరికొంతమంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామిలను సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మిగిలిన వారిని ఈ ఒక్కరోజు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.