- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: లోకేశ్కు భద్రత కల్పించండి.. అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‍షాకి తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడ రవీంద్ర కుమార్ లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍కు భద్రత కల్పించాలని లేఖలో కోరారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయని.. పోలీసులు సైతం ఆంక్షలు విధిస్తున్నారని లేఖలో ఆరోపించారు.
వైఎస్ఆర్ కడపలో కోడిగుడ్లతో లోకేశ్‌పై దాడి చేసిన అంశాన్ని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. లోకేశ్‌కు భద్రత కల్పించాలని లేఖలో కోరారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..ప్రజలు భయంతో బతుకుతున్నారని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ పాలన, ఆధిపత్య ధోరణి, నేర ప్రవృత్తి వంటివి ఈ పరిస్థితికి కారణమని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్రకుమార్ లేఖలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :: Breaking: టీడీపీ నేత బోండా ఉమ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల కలకలం