ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |
ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదలకాబోతోన్నాయి. ఈ ఎన్నకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ నేతలు చెబుతుంటే.. ప్రభుత్వ వ్యతిరేకతే తమ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.


ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఆయన ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఏపీ రిజల్ట్స్‌పై తమకు ఉత్కంఠగా ఉందని తెలిపారు. తొలిసారి ఏపీ ప్రజల నాడిని పట్టుకోలేకపోతున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి చెరో సగం సీట్లు వస్తాయన్నారు. ఒక వేళ కాంగ్రెస్‌కు 10 సీట్లు అయినా రావొచ్చని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఈసారి అంత సులువు కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed