Breaking:జగన్ పాలనపై తెలంగాణ నేత సంచలన వ్యాఖ్యలు ..చంద్రబాబు పై ప్రశంసలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-06 11:55:55.0  )
Breaking:జగన్ పాలనపై తెలంగాణ నేత సంచలన వ్యాఖ్యలు ..చంద్రబాబు పై ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంగళవారం మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం గోనె ప్రకాశరావు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో గత వైసీపీ ఐదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలన అంటూ డిమాండ్ చేసిన జగన్‌కు సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చాక.. రాష్ట్రపతి పాలనకు ఎలా అనుమతిస్తారు అడిగారు. గత ప్రభుత్వం ఏపీ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా దర్బార్‌లు నిర్వహించి మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. జన్మభూమి లాంటి కార్యక్రమాలు చంద్రబాబు చేపడితే.. విదేశీ విరాళాలు సేకరించేందుకు కృషి చేస్తా అన్నారు. గత ప్రభుత్వం అసలు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు అని ఫైరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని ఎద్దేవా చేశారు. బంధువులే తనకు తెలీదంటూ సీబీఐ కోర్టుకు అబద్ధాలు చెప్పిన జగన్ ఓ దుర్మార్గుడు అని గోనే ప్రకాశరావు మండిపడ్డారు. దేశంలో జగన్‌లా పరదాలు కట్టుకుని ఏ సీఎం పర్యటించలేదని ఆయన విమర్శించారు.




Advertisement

Next Story