Amaravati: నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం

by Jakkula Mamatha |
Amaravati: నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం
X

దిశ, ఏపీ బ్యూరో:రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ ఇంజనీర్లతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించనున్నారు. సెక్రటేరియట్,హెచ్‌వోడి కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది.

దీనికోసం భారీ ఫౌండేషన్‌లతో పునాదులు కూడా వేసింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల పునాదుల పటిష్టతను పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ల నుంచి ఇద్దరేసి ఇంజనీర్ల బృందాలు శుక్రవారం అమరావతికి రానున్నాయి. రెండు బృందాలు రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాల ను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. అమరావతి పర్యటన లో భాగంగా సీఆర్డీఏ అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

Advertisement

Next Story