తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్ హారతి మృతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-16 14:32:53.0  )
తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్ హారతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్వతీపురం సరాయివలసలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో కొట్టుకుపోయిన టీచర్ హారతి మృతిచెందింది. గల్లంతు అయిన మహేశ్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు హరియాణా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సరాయివలసలోని ఏకలవ్య పాఠశాలలో విధులు ముగించుకొని టీచర్ హారతి, వార్డెన్ మహేశ్ బైకుపై వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఉన్నటువంటి ఒట్టిగెడ్డ వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో వీరిద్దరు గల్లంతు అయ్యారు. కొత్త దూరం వెళ్లాక మహేశ్ చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కొట్టుకుపోయిన హారతి మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story