పవిత్రమైన వృత్తిలో ఉండి రూ. 5 కోట్లకు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు

by srinivas |
పవిత్రమైన వృత్తిలో ఉండి రూ. 5 కోట్లకు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా విడనపనకల్లు మండలం హోవలిగి జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయుడు భద్రీనాథ్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. 60 మంది తోటి ఉపాధ్యాయుల వద్ద రూ. 5 కోట్ల మేర అప్పులు తీసుకున్నారు. కొన్ని రోజులు వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. అయితే భద్రీనాథ్ అకస్మాత్తుగా ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. హోవలిగి జడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న తోటి ఉపాధ్యాయుల వద్ద భద్రీనాథ్ రూ. 25 లక్షలు తీసుకున్నారు. ఇతర పాఠశాలలకు చెందిన టీచర్ల నుంచి సైతం డబ్బులు తీసుకున్నారు. అనంతరం ఉడాయించారు. సహచర ఉపాధ్యాయుడే రూ. 5 కోట్లకు టోపీ పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story