టీడీపీకి పట్టిన శని లోకేశ్... ఏడవటానికి మాత్రమే పనికొస్తాడు: మంత్రి అంబటి రాంబాబు

by Seetharam |
టీడీపీకి పట్టిన శని లోకేశ్... ఏడవటానికి మాత్రమే పనికొస్తాడు: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కేవలం ఏడవటానికే మాత్రమే పనికొస్తాడు..పార్టీని నడిపేందుకు పనికిరాడు అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేశ్‌కు పార్టీని నడిపే సత్తా, సామర్థ్యం లేవని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని లోకేశ్ అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడు లోకేశ్ ఎంట్రీ ఇవ్వడంతో అధోపాతాళినికి టీడీపీ వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. లోకేశ్ రాకతో టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని.. టీడీపీకి నాయకత్వం వహించే లక్షణాలు కూడా లేవని అన్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు సైతం తెలుసనని అయితే ప్రస్తుతం లోకేశ్ ఒక్కరే దిక్కుకావడంతో మిన్నకుండిపోతున్నారని అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ఏనాడూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు సంతకాలను సీఐడీ ఆధారాలతో సహా సేకరించిందని చెప్పుకొచ్చారు. అందువల్లే చంద్రబాబుకు బెయిల్ రావడం లేదని న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయనక్నారు. ఇకనైనా చంద్రబాబునాయుడు స్కిల్ స్కాం కేసులో ప్రధాన సూత్రధారి అనే విషయాన్నిటీడీపీ గ్రహించి ఆందోళనకు స్వస్తి చెప్పితే మంచిదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed