- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం! ఇక రాజ్యసభలో పార్టీ ఉనికి గల్లంతేనా?
దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాజ్యసభ ఎన్నికల పోటీకి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ దూరంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ఒకే ఒక సభ్యుడు కనకమేడల రవీంద్ర ఉన్నారు. వచ్చే నెలలో ఆయన పదవీకాలం పూర్తి కానుంది. తర్వాత రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేనట్టేనని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.
రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరో 27 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అవసరం. మరోవైపు శాససనసభలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు వైసీపీ పార్టీ ఖాతాలో చేరుతాయని, మరోవైపు రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైసీపీ పరం అవుతాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే టీడీపీకి రాజ్యసభలో ఉనికే లేకుండాపొతుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి కావడంతో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్సీ గెలుపు సీన్ రిపీట్?
గత ఏడాది ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగితే.. చివరి స్థానానికి టీడీపీ కైవసం చేసుకుంది. అప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధిష్టానం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఎమ్మెల్సీలో వేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా? అనేది వేచి చూడాలి.
అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ చేయనున్నట్లు కన్పిస్తుంది. దీంతో ఇప్పటి వరకు టీడీపీ అధినేత ఈ టాపిక్‌పై మాట్లాడలేనట్లు తెలుస్తొంది.
Also Read..