ఢిల్లీలో నారా లోకేశ్ నిరాహార దీక్ష.. పాల్గొన్న టీడీపీ ఎంపీలు

by Seetharam |   ( Updated:2023-10-02 06:05:36.0  )
ఢిల్లీలో నారా లోకేశ్ నిరాహార దీక్ష.. పాల్గొన్న టీడీపీ ఎంపీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీక్షకు దిగారు. న్యూఢిల్లీలోని లోధి ఎస్టేట్స్‌లో మహాత్మగాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు,భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, కోండ్రు మురళీమోహన్ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. దీక్షకు ముందు మహాత్మగాంధీ చిత్రపటానికి నారా లోకేశ్‌తోపాటు ఎంపీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుందని టీడీపీ అధిష్టానం ప్రకటించింది.

Advertisement

Next Story