బ్రేకింగ్: మరో TDP కీలక నేతకు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

by Satheesh |   ( Updated:2023-01-29 03:40:00.0  )
బ్రేకింగ్: మరో TDP కీలక నేతకు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్, ఎమ్మెల్సీ నేత బచ్చుల అర్జునుడు ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అర్జునుడు గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అర్జుునుడికి బీపీ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండె పోటుకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ అర్జునుడు గతంలో కూడా గుండె పోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, అర్జునుడు ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఇన్ చార్జ్‌గా కొనసాగుతున్నారు. నటుడు నందమూరి తారకరత్న హార్ట్ స్ట్రోక్‌‌కు గురై బెంగళూరులో చికిత్స పొందుతుండగానే.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ గుండెపోటుకు గురికావడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Also Read..

బ్రేకింగ్: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed