- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అనుభవం లేని పాలకుల వల్ల ప్రజలు నష్టపోయారు’..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో హిందూపురం రూరల్ మండలం కోటిపి వద్ద అసంపూర్తిగా నిలిచిన టిడ్కో ఇళ్లను ఎంపీ బీకే పార్థసారథి, అధికారులతో కలిసి బాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ క్రమంలో వైసీపీ పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం పాలకుల వల్ల ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యం మయ్యాయని, గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అనుభవం లేని పాలకుల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
గత ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించి నకిలీ మద్యం, ఇసుక దందా, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 1200 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అవి ఇప్పటి వరకు అలాగే అసంపూర్తిగా ఉండిపోయాయని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. హిందూపురంలో యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు తీసుకొస్తామని, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేశారు.