- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సీఎం పై బురద జల్లడం మానుకోండి’..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు నేరుగా సాయం అందిస్తున్న సీఎం చంద్రబాబు పై వైసీపీ బురద జల్లడం మానుకోవాలని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.
గత ఐదేళ్లుగా బుడమేరును గాలికొదిలేసిన YS జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎంగా ఉన్న ఐదేళ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత జగన్ ఏనాడు బయటకు రాలేదని చెప్పారు. చంద్రబాబు ఇంటి కోసం బుడమేరు నీటిని డైవర్ట్ చేశారని జగన్ చెప్పడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం సహాయం అందించడం లేదనే వైసీపీ నేతల విమర్శలపై ఆయన తాజాగా స్పందించారు. రెండు రోజులుగా సీఎం చంద్రబాబు ప్రజల మధ్యే ఉన్నారని తెలిపారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు.