- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావు..సంచలన విషయాలు బయటపెట్టిన టీడీపీ ఎమ్మెల్యే
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న రుషికొండ భవనం పై తాజాగా ట్వీట్టర్‌లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం అయి, ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా ఆదివారం ఉదయం మీడియాను, కొంతమంది కార్యకర్తలను వెంటబెట్టుకొని రుషికొండ భవనం దగ్గర వెళ్లి అక్కడ ఉన్న రహస్యలను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.
రుషికొండ పై ఉన్న భవనాల రహస్యం ఎన్నికలకు ముందే బహిర్గతమై ఉంటే వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కాదని గంటా శ్రీనివాసరావు అన్నారు. మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత ఫైవ్‌స్టార్ హోటల్ అన్నారు. ఆ పైన సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. అనుమతులు లేవని మీరు ప్రజావేదికను కూల్చేశారు అని గుర్తు చేశారు. మరి అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చేయాలి అని ట్విట్టర్ వేదికగా గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రుషికొండ పర్యాటక కాటేజీలను ధ్వంసం చేసి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యంత విలాసమైన ప్యాలెస్ నిర్మించినట్లు సమాచారం.