- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్.. సరికాదంటూ ఎమ్మెల్యే గంటా అభ్యంతరం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ వైసీపీ రాజ్యసభకు చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో చాలా మంది వైసీపీ నేతలు సైకిల్ తీర్థం పుచ్చకుంటున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ ఫిరాయింపులు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. పార్టీ మారిన ఎంపీలు, విశాఖకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్‌కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్టీల్‌ప్లాంట్ కోసం తాను రాజీనామా చేశామని గుర్తు చేశారు. అప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. YCP ఎంపీలు రాజీనామా చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. అప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా ఇప్పుడు డిమాండ్ చేయడం సరికాదన్నారు. విజయసాయికి ప్రతిది రాజకీయం చేయడం అలవాటని గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.