- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: జగన్ మనస్తత్వంపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పక్షానికి విపక్షాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్ మనస్తత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిది ఒక విపరీత మనస్తత్వం అని.. ఇక ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసిన మౌనంగా ఉండడాన్ని విపరీత మనస్తత్వం అంటారని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు అడిగినా, పత్రికలు అడిగినా, ప్రజా సంఘాలు అడిగిన, కుల సంఘాలు అడిగినా, హేతువాదులు అడిగినా, న్యాయవాదులు అడిగినా, ఎవరు అడిగినా జగన్మోహన్ రెడ్డి ఎవరికీ సమాధానం చెప్పరని ఆరోపించారు. ఎవరైనా ఏదైనా అడిగినా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటారని.. అలా మౌనంగా ఉంటె అడిగిన ప్రశ్నకు అర్ధఅంగీకారం తెలిపినట్లా..? లేక ఒప్పుకున్నట్ల..? లేకపోతే ఆయన దగ్గర సమాధానం లేనట్లా..? ఎలా అర్ధం చేసుకోవాలి అని రామయ్య ప్రశ్నించారు.
అందుకే ముఖ్యమంత్రి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని తాను రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఇక జగన్ మనస్తత్వం విపరీత మనస్తత్వం కాదని జగన్ గాని లేక ఆయనకు సంబంధించిన వాళ్ళు గాని చెప్పాలి అనుకుంటే తాము చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని 43 వేల కోట్ల రూపాయలు కాజేశారని సిబిఐ జగన్ పైన 11 ఛార్జ్ షీట్లు వేసిందని..అందుకు రికార్డులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
సిబిఐ 11 ఛార్జ్ షీట్లను సిబిఐ కోర్టులో వేసిందని.. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుందని.. వాటన్నింటికి కోర్టు క్యాలెండర్ నెంబర్ ఇచ్చిందని.. ఇక విచారణ జరగబోయే సమయంలో ఎందుకో ఆగిపోయిందని.. ఎందుకు ఆగిపోయిందో సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని.. న్యాయశాస్త్రం గురించి కాస్తోకూస్తో పరిజ్ఞానం ఉంది కనుక తాను ఆ విషయం పైన మాట్లాడాను అన్నారు.
ఎందుకంటే ఆ కేసుల విచారణ ఎందుకు ఆగిపోయింది..అది లీగల్ స్టే లేక ఇల్లీగల్ స్టే అనేది సుప్రీం కోర్టు తేలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. అదేసమయంలో ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా జగన్ పై 5 కేసులు రిజస్టర్ చేసిందని తెలిపారు. ఆ 5 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లను వేసి జగన్ కు సంబంధించిన రూ/ 2000 కోట్ల పైచీలకు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
అందుకు సంబంధించిన లిస్ట్ కూడా తన దగ్గర ఉందని..కానీ అవన్నీ ప్రజలకు చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. అయితే తాను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం.. జార్ఖండ్ ముఖ్యమంత్రి బిట్లు బిట్లుగా ఉన్న 8 ఎకరాల భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ ముఖ్యమంత్రిని ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందని తెలిపారు.
అలానే అప్పటికప్పుడు అతనితో రాజీనామా చేపించారని.. అనంతరం ఆయన్ని సెంట్రల్ జైలు కి పంపించారని వెల్లడించారు. ఇక విధులను సక్రమంగా నిర్వర్తించిన ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా.. ఏ స్థాయిలో ఉన్న ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. ఇక మా ముఖ్యమంత్రి వైపు కూడా ఒకసారి చుడండి అని ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరుతున్నాను అని పేర్కొన్నారు.