ఉచిత బస్సు పథకంపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు వీడియో వైరల్

by srinivas |
ఉచిత బస్సు పథకంపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఉచిత బస్సు ప్రయాణం పథకం(Free Bus JourneyScheme)పై వైసీపీ(Ycp) విమర్శలకు స్థ్రాంగ్ కౌంటర్ ఇస్తూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) గతంలో మాట్లాడిన వీడియోను టీడీపీ(TDP)నేతలు వైరల్ చేస్తున్నారు. ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అలాగే నారా లోకేశ్(Nara lokesh) కూడా జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC Bus)లో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. అయితే శాసనమండలిలో తాజాగా మంత్రి గుమ్మడి సుధారాణి(Minister Gummadi Sudharani) కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు. వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘‘ ఉచిత బస్సు పథకం కింద జిల్లాల్లోనే మహిళలు ప్రయాణం చేయొచ్చని, ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే టికెట్ తీసుకోవాలి.’’ అని ఆమె తెలిపారు.

దీంతో రాష్ట్ర స్థాయిలో మహిళలకు ఉచిత బస్సు పథకం చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు జిల్లాలకే పరిమితం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు, లోకేశ్ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ‘‘ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు.’’ అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed