- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీచర్ల బదిలీల్లో భారీ దోపిడీ.. మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల ముందు ప్రభుత్వం టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బదిలీల విషయంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. భార్యాభర్తల బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారాయని ప్రచారం జరిగింది. అయితే తాము అధికారంలోకి వస్తే టీచర్ల బదిలీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పడు మంత్రి బొత్సపై ఏసీబీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీచర్ల బదిలీల్లో మాజీ మంత్రి బొత్స అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్కో టీచర్ నుంచి రూ.3 నుంచి 6 లక్షలు కొట్టేశారని పేర్కొ్న్నారు. ఇది బొత్స హయాంలోనే జరిగిన భారీ దోపిడీ అని వర్ల వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే బదిలీలు చేశారని ఆరోపించారు. అవినీతి చేసిన మంత్రులను విడిచిపెట్టమని చెప్పారు. బొత్స అవినీతి బయటపెట్టి ఆయన్ను అరెస్ట్ చేసే వరకూ వదిలిపెట్టమని వర్ల రామయ్య హెచ్చరించారు.