- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devineni Avinashను శిక్షించే ధైర్యం జగన్‌కి ఉందా?
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాన్ని కుంభకోణాలు, దోపిడీలకు నెలవుగా మార్చిన వైసీపీ నేతలు, డబ్బుకోసం ఆఖరికి ఆడబిడ్డల శరీరాలను అంగట్లో సరుకుగా మార్చే దుస్థితికి దిగజారారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. రాజకీయాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరాన్ని వ్యభిచార కేంద్రాలు, డ్రగ్స్ సెంటర్ల అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాచారాలు, హత్యలు, భూకబ్జాలు, కుంభకోణాలు, లిక్కర్, ఇసుక మాఫియాల్లో మునిగి తేలుతున్న వైసీపీ నేతలు, తాజాగా సెక్స్ రాకెట్లలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారని మండిపడ్డారు.
'గుట్కాలు తింటూ కేసినోలు నడిపేవారు, సంస్థల ముసుగులో ప్రజలసొమ్ము కొట్టేసేవారు, వ్యభిచార కేంద్రాలు నడిపేవారు నేడు బెజవాడలో నాయకులుగా చెలామణి అవుతున్నారు. వైసీపీలో తనను మించిన నాయకుడులేడని మిడిసిపడే దేవినేని అవినాశ్, బూతుల నాని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వల్లభనేని వంశీలకు పోటీగా ఎదగాలన్న తాపత్రయంలో సిగ్గు, శరం లేకుండా వ్యభిచారకేంద్రాలు నిర్వహించేస్థాయికి దిగజారాడు.' అని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు.
అవినాశ్ అనే విషపు మొక్కను ఆదిలోనే జగన్ తుంచేసి ఉంటే, నేడు విజయవాడ నగరం వ్యభిచార కేంద్రాలకు నెలవుగా మారేదికాదని మాణిక్యరావు అన్నారు. విజయవాడలో వైసీపీ మహిళా నేత గురుసాయి నడుపుతున్న వ్యభిచారకేంద్రాల వెనక అవినాశ్ ఉన్నాడని రాష్ట్రమంతా కోడైకూస్తోందని వ్యాఖ్యానించారు. నాగసాయిని కాపాడటానికి అవినాశ్ ఎన్నిసార్లు విజయవాడ పటమట పోలీసులకు ఫోన్ చేశాడో చెప్పాల్సిన పని లేదన్నారు. నాగసాయి, అవినాశ్‌ల దుష్టక్రీడలో ప్రకాశ్ అనే యువకుడు అన్యాయంగా బలైపోయాడని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. 'ఆడబిడ్డల శరీరాలతో వ్యాపారం చేసే నికృష్ఠుల విషయంలో ముఖ్యమంత్రి, పోలీసులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించకపోతే, మరిన్ని దారుణాలు చూడాల్సిన దుస్థితి ప్రజలకు వస్తుంది. డీజీపీ అవినాశ్ చొక్కా పట్టుకొని లాక్కొచ్చి సెల్లో వేస్తే, పోలీస్ శాఖ తమకోసం పనిచేస్తుందనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది' అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు.
READ MORE