- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వివేకా హత్య కథ, స్రీన్ ప్లే, డైరెక్షన్ సీఎం దంపతులదే.. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై జగన్ రెడ్డి, భారతి రెడ్డి నోరు తెరవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. వివేకా హత్యతో సీఎం జగన్ దంపతులకు ఎలాంటి సంబంధం లేకపోతే హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 03-04 గంటల మధ్య అవినాశ్ రెడ్డితో నవీన్, కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ల ద్వారా ఏం మాట్లాడారు? హత్య గురించి కాకపోతే అంత అర్ధరాత్రి వేళ ఏం మాట్లాడుతారు? జగన్ రెడ్డి, భారతి రెడ్డికి హత్యతో సంబంధం లేకపోతే.. నాటి కాల్ డేటాను బయట పెట్టమని సీబీఐని కోరి తమ నిజాయితీని నిరూపించుకోగలరా? అని సవాల్ విసిరారు. హత్య ఆనవాళ్లను అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ధ్వంసం చేశారంటే హత్యతో సమానమేనని ఎంపీ స్థాయి వ్యక్తికి తెలియదా? అని ప్రశ్నించారు. అత్యంత దారుణంగా హత్యకు గురైతే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఖననం చేసేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రయత్నించడం వెనుక మతలబు ఏంటని నిలదీశారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని సీఎం జగన్ రెడ్డి ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గుండెపోటు అంటూ ఎందుకు సొంత పత్రికలో ప్రచారం చేయించారు అని నిలదీశారు.
వివేకా హత్య కేసులో అరెస్టైన డి.శివశంకర్ రెడ్డిని వైసీపీ నుండి ఎందుకు బహిష్కరించలేదు? హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అడిషనల్ ఎస్పీ రాంసింగ్ ను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం జగన్ రెడ్డి ప్రోద్బలం లేకుండానే జరిగిందా? వివేకా హత్య కేసులో నిందితుడిగా అరెస్టైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా రిమ్స్ కు తరలించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్ర లేదని చెప్పగలరా? కడప ఎంపీ సీటు కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగిందని జగన్ రెడ్డి సొంత చెల్లెల్లు చెప్పడం అబద్దమా? సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొనడం అబద్దమా? అని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తే.. తక్షణమే హత్య జరిగిన రోజు కాల్ డేటాను బయట పెట్టాలని జగన్ రెడ్డి దంపతులు సీబీఐని కోరాలి అని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు.