జైలుకెళ్లేందుకు సిద్ధమా జగన్.. మరోసారి రెడ్ డైరీ తెచ్చిన యువనేత లోకేష్

by Ramesh N |
జైలుకెళ్లేందుకు సిద్ధమా జగన్.. మరోసారి రెడ్ డైరీ తెచ్చిన యువనేత లోకేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జైలుకెళ్లేందకు సిద్దమా జగన్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ మొదటి ‘శంఖారావం’ యాత్రలో భాగంగా ఆయన ఇచ్చాపురం సభలో మాట్లాడారు. జగన్ సిద్ధం సభ చూస్తుంటే నవ్వోస్తుందన్నారు. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు.. దేనికి సిద్ధం జైలు కు వెళ్ళడానికా? అని విమర్శించారు. జైలుకు పంపించడానికి ప్రజలు సిద్దమా అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాలోకేష్ మరోసారి రెడ్‌డైరీని తన వెంటన తెచ్చుకున్నారు.

అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ హామీ

టీడీపీ అధికారంలోకి చేసే అభివృద్ధి గురించి లోకేష్ వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ దేనని జ్యోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. గత టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చేస్తే.. జగన్‌ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదని, ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

Advertisement

Next Story