గంటాకు మళ్లీ షాక్ .. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ కీలక ప్రకటన

by srinivas |
గంటాకు మళ్లీ షాక్ .. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుకు మళ్లీ షాక్ తగిలింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను అసెంబ్లీ వర్గాలకు పంపించారు. దీంతో గంటా రాజీనామాను పరిశీలించిన స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గంటా రాజీనామాపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇందుకు గంటా శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ గంటా రాజీనామాను ఆమోదించడంపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అటు గంటా శ్రీనివాసరావు కూడా స్పీకర్ తీరును తప్పుబట్టారు. అయినా సరే స్పీకర్ తమ్మినేని సీతారాం వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ సమావేశాల వేళ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో గంటా రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో గంటా శ్రీనివాసరావు వ్యూహానికి స్పీకర్ చెక్ పెట్టినట్లు అయింది. స్టీల్ ప్లాంట్‌ విషయంలో వైసీపీని టార్గెట్ చేసిన గంటాకు తాజాగా స్పీకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story