వైసీపీ కొత్త పథకం 'జగనన్న అన్యమత ప్రచారం'

by srinivas |
వైసీపీ కొత్త పథకం జగనన్న అన్యమత ప్రచారం
X
  • పరమతసహనం లేని వ్యక్తి పరిపాలనకు అనర్హుడు
  • - టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూడీ రాకేశ్

దిశ, డైనిమిక్ బ్యూరో : జగన్ రెడ్డి పాలన హిందూసమాజానికి అంధకారమే మిగిల్చిందని, వినాయకచవితి మండపాలు పెట్టుకోవడానికి, దుర్టాష్టమి నిర్వహణకు అనుమతులు తీసుకోవాలనే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూడీ రాకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన సంకుచిత మనస్తత్వంతో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలను కూడా కొన్నివర్గాలు, వ్యక్తులకే పరిమితం చేశాడని ఆయన మండిపడ్డారు.

'జగన్ రెడ్డి అధికారంలోకివచ్చీరాగానే ప్రపంచ ప్రఖ్యాత పరమపవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని చిన్నచూపు చూశాడు. బ్రహ్మోత్సవాలవేళ సతీసమీతంగా స్వామివారికి వస్త్రాలు సమర్పించాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చాడు. అన్యమత ప్రచారంలో పాల్గొనే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌ను చేసి, వెంకన్నభక్తుల మనోభావాల్ని మంటగలిపాడు. ఈ విధంగా తనమతమేగొప్ప, ఇతరమతాలు పనికిరానివన్నట్లు పరమత సహనం లేకుండా ప్రదర్శిస్తున్న వ్యక్తి ప్రజల్ని పాలించడానికి ముమ్మాటికీ అనర్హుడు' అని డూండీ రాకేశ్ మండిపడ్డారు.

'జగన్ రెడ్డి పాలనలో తిరుమలక్షేత్రంలో అన్యమతార్భాటం పతాకస్థాయికి చేరిందనే చెప్పాలి. గతంలో ఇలాగే అన్యమత ప్రచారం జరిగినప్పటికీ, సదరు ఘటనలపై నేటికీ వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలుచేపట్టి నిందితుల్ని శిక్షించకపోవడం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున క్రైస్తవ మిషనరీలు నిర్వహించడం తోపాటు బలవంతంగా మతమార్పిడులు జరుగుతున్నాయి. ఏ2, ఆయన కుటుంబం మిషనరీల ముసుగులో బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నా, జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం హిందువుల్ని అవమానించడం కాదా? అని డూండీ రాకేశ్ ప్రశ్నించారు.

READ MORE

Ys Vivekananda Reddy Murder Case: పులివెందుల కోర్టులో తులసమ్మ వాంగ్మూలం

Advertisement

Next Story

Most Viewed