Volunteer system:వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత డిమాండ్..!

by Jakkula Mamatha |
Volunteer system:వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత డిమాండ్..!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వలంటీర్ వ్యవస్థపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్(Volunteer) వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? కొద్దిరోజులుగా ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. వలంటీర్ వ్యవస్థను(Volunteer system) కొనసాగిస్తామని ప్రభుత్వం పదే, పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) చెప్పారు.

అయితే తాజాగా ఈ వలంటీర్ వ్యవస్థ పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వలంటీర్ వ్యవస్థను(Volunteer system) రద్దు చేయాలని పంచాయతీ రాజ్ ఛాంబర్(Panchayat Raj Chamber) రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత(TDP leader) రాజేంద్రప్రసాద్ డిమాండ్(demand) చేశారు. వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ లకు ఇవ్వాలన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీ రాజ్(Panchayat Raj) శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు వరదలతో ప్రభావితమైన 400 పంచాయతీలకు(Panchayats) రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed