ఏపీలో విధ్వంసం సృష్టించడానికే జగన్ పుట్టారు: సీఎంపై చంద్రబాబు ఫైర్

by Satheesh |   ( Updated:2023-03-29 15:40:10.0  )
ఏపీలో విధ్వంసం సృష్టించడానికే జగన్ పుట్టారు: సీఎంపై చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో విధ్యంసం సృష్టించడానికే జగన్ పుట్టారని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే రాజధానిని సర్వనాశనం చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే సైకో సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఫైర్ అయ్యారు.

పులి వెందులలో గన్ కల్చర్‌పై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా బాబు డిమాండ్ చేశారు. ఏపీలో రోజు రోజుకు పెరిగిపోతున్న గొడ్డలి, గంజాయ్ కల్చర్‌కు సీఎం జగనే కారణం అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్‌పై తిరుగుబాటు ప్రారంభమైందని అన్నారు. ఏపీ పునర్ని్ర్మాణం కోసం టీడీపీకి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. ఏపీలో సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని సీరియస్ అయ్యారు. జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

Also Read..

తెలుగు వారెక్కడ ఉంటే అక్కడ TDP జెండా ఉండాల్సిందే: టీడీపీ

Advertisement

Next Story