క్యారేజీలు పట్టుకుని వెనుక తిరిగేవారు.. కేశినేనిపై బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

by srinivas |   ( Updated:2024-04-28 14:37:38.0  )
క్యారేజీలు పట్టుకుని వెనుక తిరిగేవారు.. కేశినేనిపై బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తమ అధినేత చంద్రబాబు, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరిపై అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న వ్యాఖ్యలను కేశినేని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. రాజకీయాల్లో ఎక్కువ రంగులు మార్చిన ఘనత కేశినేనిని దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం, టీడీపీలో చేరిన ఆయనకు ఆ పార్టీ అధినేతలు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అయినా పార్టీలు మారారని విమర్శించారు. వైసీపీలో చేరిన జగన్ భజన చేస్తున్న కేశినేని గత చరిత్ర గుర్తు పెట్టుకోవాలని సూచించారు. టీడీపీలో సుజనా చౌదరి ద్వారా కేశినేని నాని లబ్ధిపొందారని చెప్పారు. ఎవరిద్వారానైతే ప్రయోజనం పొందుతారో వారినే తిట్టడం కేశినేని నాని నైజమని మండిపడ్డారు. సుజనా చౌదరి క్యారేజీలు మోసి ఎంత సాయం పొందారో తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసన్నారు. కేశినేని నానికి సొంత కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడంలేదని విమర్శించారు. కేశినేని నాని శ్రీరామ్ చిట్స్‌కు కట్టాల్సిన డబ్బులు 2014 నుంచి ఇప్పటివరకూ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. డబ్బుల ఎగ్గొట్టినందుకు కేశినేనిపై కేసులు పెట్టాలన్నారు. కేశినేని నాని పెద్ద ఛీటర్ అని, అందుకే టీడీపీ నుంచి బయటకు గెంటేశారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

Read More...

పవన్ కల్యాణ్‌పై YCP ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story