NTR విగ్రహం తొలగింపు.. అచ్చెన్న తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2022-12-08 15:05:05.0  )
NTR విగ్రహం తొలగింపు.. అచ్చెన్న తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన ఎన్టీఆర్‌కు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో అవమానాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైసీపీ గూండాలు వికృతానందం పొందుతున్నారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రజలు ఆగ్రహించిన ప్రతిసారీ వారి దృష్టి మళ్ళించేందుకు ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణమని, గతంలోనూ ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారని, విగ్రహాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇలాంటి నీతి మాలిన చర్యలకు పాల్పడిన వారిలో ఒక్కరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై ఆఘమేఘాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పోలీసులు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తున్న వారిపై, ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. అధికార పార్టీకి ఒక న్యాయం, తమకో న్యాయమా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

READ MORE

Minister Bosta: ఏపీ,తెలంగాణ కలిస్తే తప్పేముంది?

Advertisement

Next Story