టీడీపీ-జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం : మంత్రి జోగి రమేశ్

by Seetharam |
టీడీపీ-జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం : మంత్రి జోగి రమేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుపై మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు వైరస్ కంటే ప్రమాదకరమని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా అధికారంలోకి వచ్చేది వైసీపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్రపై సెటైర్లు వేశారు. పెడనలో పవన్ కల్యాణ్ అట్టర్ ప్లాప్ అని అన్నారు. పెడన సభలో పవన్ కల్యాణ్ నిత్యం ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారే తప్ప ఏం చేస్తారో చెప్పలేదన్నారు. పవన్ కల్యాణ్‌కు విలువలు, విశ్వసనీయత లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని.. జగన్ పాలనను అంతా స్వాగతిస్తున్నారని అన్నారు. అలాంటి సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయనకు మనస్సాక్షి లేదు అని అనిపిస్తోందని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed