- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీతో పొత్తు చర్చలు.. టీడీపీకి బిగ్ షాక్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీతో పొత్తు చర్చలు నడుస్తున్న సమయంలో రాష్ట్రంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కేంద్రమాజీమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని ఆయన చెప్పారు. అధికారం కోసం తన ఆత్మను తాకట్టుపెట్టలేనని చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.
కాగా కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పని చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో అరకు నుంచి ఎంపీగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. బీజేపీతో పొత్తుల కోసం టీడీపీ ప్రయత్నం చేస్తుండటంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ మేరకు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా లేఖ రాశారు. మరోవైపు ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరతారనే చర్చ జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.