- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్‌ది నకిలీ నవరత్నాలు అని టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో వెలవెలబోయిందని ఆయన విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూటమి నేతల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపారు. మహిళలకు సంవత్సరానికి రూ. 18 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. చదువుకునే విద్యార్థులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ప్రతి ఏటా రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపైనా కీలక హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. అటు నిరుద్యోగులకు సైతం హామీ వర్షం కురిపించారు. కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, తొలి సంతకం ఆ ఫైలుపైనే పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ప్రజల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి రూ. 13 లక్షల కోట్ల అప్పు మిగిలిందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపైనా ఆయన కీలక వ్యాఖ్యాలు చేశారు. జగన్ మాట వినని పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. జీవనధానంపై దెబ్బ కొట్టి పోలీసు కుటుంబాల పొట్ట కొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More..
ముద్రగడకు ముచ్చెమటలు పట్టిస్తున్న కన్న కూతురు.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో వీడియో వైరల్..