- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అది సిద్ధం కాదు.. అశుద్ధం’ అంటూ చంద్రబాబు ఎద్దేవా
దిశ, ఏపీ బ్యూరో: అధికార దుర్వినియోగంతో ‘సిద్ధం’ అని సభలు పెడుతూ జగన్ అశుద్ధ మాటలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో జగన్ ప్రసంగంపై అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధమని, నిరూపించేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. వందల కోట్లు ఖర్చు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు కాదు..దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ సిద్దమా ?, ఏ అంశం మీదైనా..ఎక్కడైనా, ఏ రోజైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో..ఎవరి పాలన రాతియుగమో చర్చిద్ధామని, చర్చకు వచ్చే దమ్ముందా జగన్ అంటూ చంద్రబాబు సవాల్ చేశారు.
2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‌కు చివరి ఛాన్స్ కానుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓటమిపై జగన్‌కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్తా పక్కకు జరిపి ఎన్నికల ముందు రోడ్డెక్కాడని విమర్శించారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమంపై చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సహజ వనరుల దోపిడీతో, స్కాం కోసమే స్కీం పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్..పేదల జీవితాలపై మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ధి కాదు కదా అని ప్ రశ్నించారు. ఏ ఊరుకెళ్లినా జగన్ ఐదేళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందారుడైన జగన్‌కు ప్రజలకు మధ్య యుద్ధం జరిగేదన్నారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడత పెట్టాడని..మిగిలిన ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ప్రజలు మడత పెడతారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.