- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలుపు
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలిచారు. ఆమెకు మొత్తం 23 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం 19 అయినా ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో అనూహ్యంగా విజయం సాధించారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. క్రాస్ ఓటింగ్‌పై సీఎం జగన్ ఎన్ని చర్యలు చేపట్టినా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు పడటంతో చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లే పడతాయని అంతా ఊహించారు. కానీ క్రాస్ ఓటింగ్ పుణ్యమా అని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. రెండు ఓట్లు క్రాస్ అవటంపై అటు వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఒక స్థానంలో గెలుస్తామని ముందు నుంచి కూడా టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. అన్నట్టుగానే క్రాస్ ఓటింగ్ టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయాన్ని అందించింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలిచారు. ప్రస్తుతం ఈ ఎన్నికలో కూడా గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
Also Read...