- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీ సమావేశాల వేళ టీడీపీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల వేళ తెలుగుదేశం పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయింది. కాగా, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండవ రోజు సభ ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నిరసనకు దిగారు.
స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ బాబులపై ఈ సెషన్ మొత్తం వేటు వేసిన స్పీకర్.. బుచ్చయ్య చౌదరీ, రామానాయుడు, రామకృష్ణ బాబులపై ఇవాళ ఒక్కరోజు సస్పెన్షన్ విధించారు. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.