- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అంతేకాదు వైసీపీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి ఆ సీట్లు వెళ్లాయి. దీంతో ఆయన మనస్తాపం చెందారు. జిల్లా అధ్యక్షుడిగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి జనసేన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని భావించారు. ఆశాభంగం కలగడంతో జనసేనకు గుడ్ బై చెప్పారు. అటు పవన్ కల్యాణ్ సైతం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయనతోపాటు పలువురు కీలక నేతలు సైతం పార్టీని వీడారు. దీంతో నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్ తగిలినట్టైంది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో @JanaSenaParty ఖాళీ
— YSR Congress Party (@YSRCParty) April 19, 2024
సీఎం వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ… pic.twitter.com/NQO1y8F4bh