- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.100కోట్ల పేచీ: రాజీనామాకు సై అంటున్న JC Prabhakar Reddy
దిశ, డైనమిక్ బ్యూరో : ఒకప్పుడు దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో తాడిపత్రి మున్సిపాలిటీ ఉండేది అని చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలాంటి తాడిపత్రి మున్సిపాలిటీలో నేడు అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తాడిపత్రి మున్సిపాలిటీపై అధికారయంత్రాంగం కక్ష సాధింపునకు పాల్పడుతుంది అని ఆరోపించారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఈ నాలుగేళ్లలో ఏం చేశారో.. ఎంత నిర్లక్ష్యం చేశారో తెలియజేస్తూ ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఇందులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఈ నాలుగేళ్లలో మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి పట్టాలెక్కడం లేదన్నారు. తనపై కక్షతోనే మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అధికారులు అంతా వైసీపీ నేతల చెప్పుచేతల్లో ఉంటున్నారని ఆరోపించారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు తెచ్చామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అధికారులు చెప్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రూ.100 కోట్లు తెచ్చామని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.