- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాపాడు.. రామచంద్రా!ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో స్వరూపానంద
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలతో వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అనధికార మంత్రిగా, కార్యదర్శిగా చలామణి అయిన పెందుర్తి శారదా పీఠం స్వరూపానందకు కూటమి ప్రభుత్వంలో పట్టు చిక్కడం లేదు. ఆశ్రమానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూముల పైన, తిరుమలలో అక్రమంగా నిర్మించిన అంతస్తుల పైన తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. స్వరూపానందకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోందన్న సమాచారం బయటకు వస్తున్న సమయంలో ఆయన తనకు బాగా అలవాటైన లాబీయింగ్ అస్త్రాన్ని బయటకు తీశారు.
రంగంలోకి ద్రోణంరాజు రామచంద్ర
గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖకు చెందిన శిక్షణా సంస్ధ ‘ సీత’ డైరెక్టర్‌గా పనిచేసిన ద్రోణంరాజు రామచంద్రను రంగంలోకి దింపారు. చాతుర్మాస దీక్ష కారణంగా రుషికేష్‌లో ఉన్న స్వరూపనంద అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు. శనివారం ఆయన తరపున రామచంద్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి తదితరులను కలిసి స్వరూపనంద చాలా మంచివారని, ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా వుంటారని చెప్పించారు. ఆయనపై తొందర పడి చర్యలకు ఉపక్రమించ వద్దని కూడా రామచంద్ర విన్నవించినట్టు తెలిసింది. విశాఖలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 500 కోట్ల విలువైన స్థలం, తిరుమలలో అక్రమంగా నిర్మించిన అంతస్తుల జోలికి వెళ్లకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
వివాదంలో ఫిలింనగర్ గుడి
నకిలీ పీఠాధిపతిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వరూపానందకు అనుబంధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు లేవు. ప్రాచీన, చారిత్రక ఆలయాలు ఆయనకు అనుబంధంగా లేకపోవడంతో అప్పట్లో హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ నిర్వహించే ఆలయాన్ని పైరవీల ద్వారా తనకు అనుబంధంగా తెచ్చుకోగలిగారు. అప్పట్లో నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఆలయ బాధ్యతలు స్వరూపానందకు అప్పగించారు. అయితే, ఇటీవల వివాదాల నేపథ్యంలో హైదరాబాద్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత ఆ ఆలయం నుంచి కూడా స్వామి బయటకు పంపేశారు. శారదాపీఠం అనుబంధ ఆలయం అంటూ పెట్టిన బోర్డు కూడా తొలగించారు. దీనిపై కేసు వేసినప్పటికీ ఇంకా స్వరూప ఆధీనంలోకి రాలేదు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో ఇప్పుడు అక్కడ పరపతి లేదు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రావడంతో ఇక్కడా అదే పరిస్థితి. దీంతో ఎలాగైనా ఆంధ్రా దేవాదాయ శాఖను మచ్చిక చేసుకునే పనులు ప్రారంభించారు. మరోవైపు స్వామి శ్రీనివాసానంద నేతృత్వంలోని పలువురు స్వాములు స్వరూపానందకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.