Supreme Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం

by Shiva |
Supreme Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టులో ఆసక్తికర పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం వైస్ జగన్ (YS Jagan) బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో జగన్ రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ (Justice Sanjay Kumar) ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ తప్పుకున్నారు.

దీంతో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను 2024, డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా (Justice Abhay S Oka) ధర్మాసనానికి బదిలీ చేశారు. పొరపాటున అదే పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అందులో జస్టిస్ సంజయ్ కుమార్ (Justice Sanjay Kumar) కూడా సభ్యులుగా ఉండటంతో.. ఆ పిటిషన్ చూసిన ఆయన ‘నాట్ బి ఫోర్ మీ’ అన్నారు. కాగా, పొరపాటున జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సంజయ్ కుమార్ ఉన్న బెంచీ వద్దకు వచ్చిందంటూ సీజేఐ సంజయ్ ఖన్నా వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed