- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supreme Court: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. సుప్రీం కోర్టులో వైసీపీ నేతలకు ఊరట
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు భారీ ఊరట లభించింది. కేసులో కీలక నిందితులైన దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారందరూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. అదేవిధంగా దేశం విడిచి వెళ్లకుండా 48 గంటల్లోగా పాస్‌పోర్టులను దర్యాప్తు సంస్థ అధికారులకు అందజేయాలని జస్టిస్ సుధాన్షు దులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. కేసులో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు.
Advertisement
Next Story