SUPER SIX: ఏపీ ప్రభుత్వం గొప్ప శుభవార్త.. ఆగస్ట్ 15న మూడు పథకాలు

by Ramesh Goud |
SUPER SIX: ఏపీ ప్రభుత్వం గొప్ప శుభవార్త.. ఆగస్ట్ 15న మూడు పథకాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్న క్యాంటిన్ లు, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక పలు శాఖల నుంచి నివేధికలు కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానం పై అధ్యయనం చేయాలని సూచించారు.

ఈ పథకంతో నెలకు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు సూచించారు. అలాగే అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాల అమలుకు కూడా సన్నాహలు మొదలు పెట్టారు. ఇందులో తల్లికి వందనం పథకం కోసం ఇదివరకే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక గత ప్రభుత్వం మూసివేసిన అన్నాక్యాంటీన్లను విడతల వారిగా తిరిగి ప్రారంభించనున్నారు. ఇందులో తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. మంగళగిరి పర్యటనలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ అభిమానులు టీడీపీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అలాగే సీఎంను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు రాష్ట్రనలుమూలల నుంచి బాధితులు పెద్ద ఎత్తున మంగళగిరికి చేరుకున్నారు. దీంతో ఎన్టీఆర్ భవన్ కిటికిటలాడుతుంది. సీఎంను వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన బాధితులకు కార్యాలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి వినతి పత్రాలు తీసుకోవడమే గాక వారి బాధలను అడిగితెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలపై కొందరు వినతి సమర్పించగా.. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు స్వయంగా సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed