- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘షర్మిల ఒంటెద్దు పోకడే కాంగ్రెస్ ఓటమికి కారణం’.. సొంత పార్టీ నేత సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైఎస్ షర్మిల టీమ్ అరాచకాలు పెరిగిపోయాయని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారన్నారని మండిపడ్డారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని అన్నారు. ఎన్నికల్లో షర్మిల టీమ్ ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గింది అంటూ సుంకర పద్మశ్రీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదన్నారు. కనీసం ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదని, ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్ కూడా మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు రాష్ట్ర పర్యటన కూడా చేయలేదని, రాహుల్ గాంధీ వచ్చిన రోజు మినహా ఏ రోజు రాష్ట్రానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని సుంకర పద్మశ్రీ.. షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు.