- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News:వైఎస్ భారతిపై సునీత కీలక వ్యాఖ్యలు..!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే ఉంది. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచార గడువు కూడా రేపటితో ముగియనుండటంతో పార్టీ నేతలు ప్రచారం జోరు పెంచారు. పోటాపోటీగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై మాటాలు తూటాల్ల పేలుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ సునీత, షర్మిల సీఎం జగన్‌కి చెల్లెళ్లు అయినప్పటికీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
ఈ క్రమంలోనే వైఎస్ భారతి పై వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపుతోంది. ఆయన మరణించి ఐదు ఏండ్లు అయినా న్యాయం కోసం తన కూతురు సునీత పోరాడుతునే ఉంది. పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని ఆరోపించారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. షర్మిలను లేదా తనను భారతి నరికేస్తారని అన్నారు. భారతి సింగిల్ ప్లేయర్‌గా ఉండాలంటే అదొక్కటే అవకాశం అని చెప్పుకొచ్చారు. వివేకాను జగన్‌ని ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని చెప్పారు.