పిల్లలూ.. టెన్త్ క్లాస్‌లో ఫెయిలైతే ఇలా చేయండి!

by Anjali |   ( Updated:2023-05-06 12:11:05.0  )
పిల్లలూ.. టెన్త్ క్లాస్‌లో ఫెయిలైతే ఇలా చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇటీవలే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో విఫలమయ్యారని, తల్లిదండ్రుల భయంతో ఓ విద్యార్థి ఇంట్లో నుంచి పరారయ్యాడు. మరో విద్యార్థి సూసైడ్ చేసుకొని మరణించాడు. ఇలా చాలా ఘటనలే చూస్తున్నాం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు (మే6)న రిలీజ్ అయ్యాయి.

అందులో విద్యార్థులు 72వ.26 శాతం ఉత్తీర్జత సాధించారు. ‘‘అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడడం లాంటివి చేయొద్దు. మీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని ‘‘జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాము’’ అని మంత్రి బొత్స ప్రకటించారు. ఈ నెల(మే) 17వరకు అప్లికేషన్ చేసుకోవాలని, ఆలస్యమయితే ఫైన్‌తో 50 రూపాయతో ఈ నెల 22 వరకు అవకాశం ఉందని చెప్పారు. అలాగే రికౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 13 వరకు అప్లై చేసుకోవాలని వెల్లడించారు.

Also Read..

AP : టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ సారి వారిదే పై చేయి!

Advertisement

Next Story

Most Viewed