స్టూడెంట్‌పై టీచర్ అత్యాచారం: బాలికకు కడుపు నొప్పిరావడంతో..

by Seetharam |
స్టూడెంట్‌పై టీచర్ అత్యాచారం: బాలికకు కడుపు నొప్పిరావడంతో..
X

దిశ, డైనమిక్ బ్యూరో : విద్యార్థినులకు గుడిలోనూ.. బడిలోనూ రక్షణ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కామాంధులుగా మారుతున్నారు. తండ్రి స్థానంలో ఉంటూ విద్యార్థినిలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు ఉపాధ్యాయులు చిన్నారులను చిదియేస్తున్నారు. అన్నెంపున్నెం ఎరుగని విద్యార్థినిలపై లైంగిక దాడికి పాల్పడి గర్భిణీ స్త్రీలుగా మార్చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగింది. రెండు రోజులక్రితం బయటపడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదిరిలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఓ పదహారేళ్ల బాలిక పదో తరగతి చదువుతుంది. అయితే ఓ రోజు దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు స్టాఫ్ రూమ్‌కి వెళ్లింది. బాలిక ఒంటరిగా వెళ్లడంతో అక్కడే ఉ్న ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య ఆ బాలికపై కన్నేశాడు. స్టాఫ్ రూమ్‌లో ఎవరూ లేకపోవడంతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఈ వ్యవహారాన్ని ఎవరికి చెప్పలేదు. ఆ బాలిక మౌనాన్ని ఆసరాగా తీసుకున్న సదరు ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయాడు. పలుమార్లు బాలికను ఆ సమయంలో అక్కడే ఉన్నరెడ్డి నాగయ్య అనే టీచర్ ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాలిక భయంతో మిన్నకుండిపోయింది. బాలిక మౌనంగా ఉండిపోవడాన్ని అదునుగా తీసుకున్న సదరు కీచక టీచర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బయటపడిందిలా!

ఇదిలా ఉంటే ఈనెల 14న శనివారం బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికను పరిశీలించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. బాలికకు కడుపునొప్పి తీవ్రమవ్వడంతో ప్రసవం చేశారు. బాలిక పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆపరేషన్ అనంతరం బాలికకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు వైద్యులు రిఫర్ చేశారు. దీంతో తల్లిదండ్రులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘాతుకానికి కారణమైన కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు కదిరి డీఎస్పీ శ్రీలత బాధిత బాలికను అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు అయిన ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీలత తెలిపారు.

Advertisement

Next Story