Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్!

by Y. Venkata Narasimha Reddy |
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్!
X

దిశ, వెబ్ డెస్క్ : వైజాగ్ స్టీల్ ఫ్లాంట్(Vizag Steel Plant) లో సమ్మె సైరన్(Strike siren)మోగింది. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించిన కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసులు(Notices)ఇచ్చాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి పరిణామాలతో కార్మికులు సమ్మె చేస్తున్నట్టు తెలిపారు.

నాలుగు నెలలుగా సరిగా జీతాలు లేకున్నా.. తగినంత సిబ్బందీ లేకున్నా.. అవసరమైన ముడి సరుకు సరఫరా అంతంత మాత్రమే ఉన్నప్పటికిని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కార్మికులు ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటారు. కార్మికుల కష్టంతో సగటున నెలకు రూ.1,400-1500 కోట్ల ఆదాయం వచ్చింది. ప్లాంటులో 12,300 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి జీతాల కోసం నెలకు రూ.50 కోట్లు వరకు అవసరం.

అయితే నెలకు రూ.1,400 కోట్లు అమ్మకాల ద్వారా వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా గత ఆగస్టు నుంచి వేధిస్తున్నారు. నెలకు 30 నుంచి 35 శాతం మాత్రమే ఇచ్చి మిగిలింది పెండింగ్‌ పెడుతున్నారు.జనవరి నెల వరకు చూసుకుంటే ఒక్కో ఉద్యోగికి 300 శాతం జీతాలు రావాల్సి ఉంది. కుటుంబాలు ఆకలితో ఉన్నా ఉద్యోగులు అన్ని శక్తులూ ఒడ్డి 100 శాతం పైగా ఉత్పత్తి సాధిస్తున్నారు. ఈ కష్టాన్ని గుర్తించి సరిగ్గా జీతాలిస్తే ప్లాంటు అభివృద్ధికి మరింత కృషి చేస్తామంటున్నారు కార్మికులు.

స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇటీవల రూ.10,300 కోట్లు ప్రకటించిన ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీతోనైనా తమ కష్టాలు తీరుతాయనుకున్న కార్మికులకు నిరాశే ఎదురవుతుండటంతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసును ఇచ్చాయి.

Next Story

Most Viewed