- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వీధి కుక్కల స్వైర విహారం.. 30 మంది పై దాడి
దిశ, నందికొట్కూరు: నందికొట్కూరులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్న ,పెద్ద, వృద్ధులు, చిన్నారులను, మహిళలను కరిచి తీవ్రంగా గాయపరిచింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవాల్సిన మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మున్సిపాలిటీ, మండలంలోని బిజినవేముల, 10 బొల్లవరం గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ రోడ్లపై ప్రజలను వెంటాడుతూ గాయపరుస్తున్నాయి. గురువారం ఒకే రోజు పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. వైద్యశాలలో కుక్క కాటుకు గురైన బాధితులతో కిక్కిరిసింది. వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బాధితులకు వైద్య సేవలు అందించారు.
30 మందిని గాయపరచిన పిచ్చి కుక్క..
నందికొట్కూరు మున్సిపాలిటీలోని సంగయ్యపేట, వడ్డె పేట, కోటవీధి, రాజా వీధి, పింజరి పేట, కోట వీధి, గాంధీనగర్, శాంతి టాకీస్ ఏరియా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో పిచ్చి కుక్క స్వైర వీధిలో తిరుగుతూ చిన్నారులు, మహిళలను, వృద్ధులను దాదాపు 25 మందిని గాయపరిచింది. అంతే కాకుండా మండలంలోని బిజినవేముల, 10 బొల్లవరం గ్రామంలో 5 మంది గాయాలపాలైన బాధితులకు నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు డాక్టర్ రాజశేఖర్ వైద్యసేవలు అందించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పిచ్చి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, రాత్రి సమయంలో బయటకు వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు కుక్కలను లేకుండా చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బేబీ బాధితులను వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందిచాలని వైద్యులు రాజశేఖర్ ను ఆదేశించారు.
గాయపడిన బాధితులు..
బిజినవేముల కు చెందిన సరోజమ్మ, సయ్యద్ హమీద్, లావణ్య, వాల్మీకి నగర్, అరిఫ్, సాయి కృష్ణ, జమిల్ల, సరోజమ్మ, సయ్యద్ హనీఫ్, బాసిరున్, సలాం మియ్య, కొండమ్మ, మద్దమ్మ, బొల్లవరం, ఈషాక్, సుబ్బారెడ్డి, వీరే కాకుండా మరో 15 మందికి పైగా బాధితులు ఉన్నారని, కొందరు మెరుగైన వైద్య సేవలు కొరకు కర్నూలుకు వెళ్లినట్లు బాధితులు తెలిపారు.