‘ఆ చెట్ల కొట్టివేతను తక్షణమే అడ్డుకోండి’..హైకోర్టులో పిల్ దాఖలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-27 15:49:39.0  )
‘ఆ చెట్ల కొట్టివేతను తక్షణమే అడ్డుకోండి’..హైకోర్టులో పిల్ దాఖలు
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో ఆ చెట్లను నరికివేయడం పై హైకోర్టులో పిల్ దాఖలైంది. కోనో కార్పస్ చెట్లను అకారణంగా కొట్టేయడాన్ని అడ్డుకోవాలని ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయనే ప్రచారంలో శాస్త్రీయ నిరూపణ లేదన్నారు. ఆ చెట్లను అక్రమంగా కొట్టిన వారి నుంచి చట్టం ప్రకారం డబ్బులు వసూలు చేసేలా ఆదేశించాలని కోరారు. పలు జిల్లాల్లో కొట్టివేశారని పేర్కొంటూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కోనో కార్పస్ మొక్కలు నాటొచ్చా లేదా అనేది శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిల్‌లో కోరారు.

రాష్ట్రంలో కోనో కార్పస్‌ మొక్కలు, చెట్ల నుంచి విడుదలయ్యే పుప్పొడితో ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడతారని, ఈ చెట్లు ఆక్సిజన్‌ విడుదల చేయవు అనడం అపోహలని పిల్‌లో పేర్కొన్నారు. జంతువులు సైతం ఆ మొక్కలను తినవని..వాటి వేర్లు భూగర్భంలో వేసిన పైప్ లైన్లను ధ్వంసం చేస్తాయని ఇలా ఎన్నో రకాల అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ మొక్కలను కొట్టేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిల్‌ పరిష్కారం అయ్యేవరకు రాష్ట్ర వ్యాప్తంగా కోనోకార్పస్‌ చెట్లను నరికివేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల కాకినాడ జిల్లాలో 4,600కుపైగా కోనో కార్పస్ చెట్లను కొట్టేశారని పిల్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో చెట్లను పరిరక్షించి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ పిల్ పై రేపు హైకోర్టులో విచారణ జరుపనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed