- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూపకల్పనకు అడుగులు: టీడీపీ - జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సభ్యుల సమావేశం
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ-జనసేన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ - జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపాందించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అందుకోసం ఇటీవలే ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యులను సైతం ఇరు పార్టీలు నియమించాయి. టీడీపీ తరఫున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు నియమితులు కాగా జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌లు నియమితులయ్యారు. ఈ ఆరుగురు సభ్యులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహాం 3గంటలకు భేటీ అయ్యారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఈ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ శ్రమించినుంది. టీడీపీ-జనసేన సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలు ఇవ్వగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అంటూ పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ అంశాలపై చర్చించి ప్రజల హృదయాలను గెలిచేలా మేనిఫెస్టో రూపొందించాలని ఈ కమిటీలకు ఇరు పార్టీల అధినేతలు ఆదేశించిన సంగతి తెలిసిందే.