ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు

by Seetharam |
ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తుఫాన్ ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ,గాలులు వీస్తునందున వ సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తుఫాన్ తీవ్రత తగ్గే వరకు సురక్షిత ప్రాంతాలకు చేరాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సూచించారు. ఆదివారం అల్లూరు మండలం సముద్ర తీర గ్రామమైన ఇస్కపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భారీ వర్షం,గాలులు వీస్తున్నందున ప్రజలు సురక్షిత ప్రాంతానికి, సైక్లోన్ షెల్టర్లుకు ,ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అధికారులంతా అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. బకింగ్ హామ్ కాలువ తీరప్రాంతం మధ్య వున్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తీరప్రాంతంలో ఉన్న 9 మండలాల తహిసిల్డార్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాలలో తహసిల్దార్ లు లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులను గమనిస్తూ అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ కోరారు.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి

మిచౌంగ్ తుఫాన్ కారణంగా తుమ్మలపెంట గ్రామం మరియు సముద్ర తీరం నందు జిల్లా ఎస్పీ డా.కే తిరుమలేశ్వరరెడ్డి పర్యటించి.. ప్రజలకు అవగాహన కల్పించారు. కావలి పరిధిలోని తుమ్మలపెంట పునరావాస కేంద్రం, పరిసర తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా, తుపాన్ వెళ్లిపోయేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర ప్రాంతాలలో ఉన్న మత్స్యకారుల పరిస్థితులు అడిగి తెలుసుకుని వేటకు ఎట్టిపరిస్థితులలో వెళ్ళరాదని సూచించారు. తుపాను తీరం దాటే మార్గం ఇంకా నిర్ణయించలేదు.ఊహలు జరుగుతున్నాయి. ప్రజల సహాయార్థం, సహాయక చర్యల కోసం పోలీసు సిబ్బంది 24x7 అందుబాటు ఉంటారని తెలిపారు. పోలీసు అధికారులు తీర ప్రాంత గ్రామాలలో పర్యటిస్తూ, పరిస్థితులను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు పోలీసు సహాయక చర్యలకు డయల్- 112/100 లేదా పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 9392903413కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఎస్పీ డా.కే తిరుమలేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed