నిబంధనలకు విరుద్ధంగా లీజుకు వక్ఫ్ భూములు.. టీడీపీపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆరోపణలు

by Vinod kumar |
నిబంధనలకు విరుద్ధంగా లీజుకు వక్ఫ్ భూములు.. టీడీపీపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆరోపణలు
X

దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వక్ఫ్ భూములను లీజుకు ఇచ్చిందని రాష్ట్ర వక్ష్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ భాష ఆరోపించారు. ఈ ముసుగులో అనకాపల్లి జిల్లాలో 250 ఎకరాల వక్ఫ్ భూములను తెలుగుదేశం నాయకుడు అచ్చెన్నాయుడు ఆక్రమించారని ఆరోపించారు. విశాఖపట్నం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉండగా.. 28 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఏళ్ల తరబడి ఆక్రమణలో ఉన్నాయన్నారు. అచ్చెన్నాయుడు ఆక్రమించిన 250 ఎకరాల వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై వుందన్నారు. తమకు అనుకూలమైన మీడియాను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు సభ్యులు కెవి బాబా, అఫ్రోజ్,ముగ్బుల్, గౌస్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story