- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి బుగ్గన పర్యటనలో అపశృతి.. 70మందిపై తేనెటీగల దాడి
by Javid Pasha |

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడి నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు.
ఓ ప్రాంతంలో చెట్టు వద్ద పనులను మంత్రి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు రెచ్చిపోయాయి. వీరిపై దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు అధికారులు, అధికార పార్టీ నాయకులు గాయపడ్డారు. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సిబ్బంది సురక్షితంగా అక్కడ నుంచి తప్పించారు.
Next Story